గాంధీభవన్‌లో కాంగ్రెస్ నేతల బాహాబాహీ.. కిందపడిన ఫిరోజ్‌ఖాన్
- ప్రోటోకాల్ విషయంలో ఫిరోజ్ ఖాన్, ఉస్మాన్ అల్ హజ్రీ మధ్య ఘర్షణ
- అజారుద్దీన్ పక్కన కూర్చునే అంశంలో వివాదం
- అడ్డుకునేందుకు ప్రయత్నించిన వీహెచ్‌ను నెట్టివేసే యత్నం
- ఇది తమ ఫ్యామిలీ విషయమన్న ఫిరోజ్ ఖాన్
కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశం రసాభాసగా మారింది. మంత్రులు పొన్నం ప్రభాకర్, అజారుద్దీన్ ముందే నేతలు ఫిరోజ్ ఖాన్, ఉస్మాన్ అల్ హజ్రీ ఘర్షణపడ్డారు. ఉస్మాన్ నెట్టివేయడంతో ఫిరోజ్ ఖాన్ కిందపడ్డారు. ప్రోటోకాల్ విషయంలో వీరి మధ్య గొడవ జరిగింది. అజారుద్దీన్ పక్కన కూర్చునే అంశంలో వివాదం చెలరేగింది. ఈ క్రమంలో ఇరువురి మధ్య ఘర్షణ జరిగింది.
ఇద్దరి మధ్య ఘర్షణను అడ్డుకునేందుకు సీనియర్ నేత వి. హనుమంతరావు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఆయనను కూడా నెట్టివేసేలా వారి తీరు ఉండటంతో మిగిలిన వారు అడ్డుకున్నారు. ఈ పరిణామంతో అజారుద్దీన్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. సమావేశం ముగిసినట్లు పొన్నం ప్రభాకర్ ప్రకటించారు.
గొడవపై స్పందించిన ఫిరోజ్ ఖాన్
కుర్చీ విషయంలో చిన్న మిస్ అండర్‌స్టాండింగ్ వల్ల గొడవ జరిగిందని ఫిరోజ్ ఖాన్ తెలిపారు. మంత్రి పక్కన కూర్చోవాలని అందరూ అనుకున్నారని పేర్కొన్నారు. ఉస్మాన్ తనకు పెద్దన్నలాంటివాడని పేర్కొన్నారు. ఇది తమ కుటుంబ విషయమని స్పష్టం చేశారు.